Home Page SliderNational

ICC ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో హార్థిక్ పాండ్యా

Share with

“గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది” అనే కేజీయఫ్ డైలాగ్ టీమిండియా క్రికెటర్ హార్థిక్ పాండ్యాకు చక్కగా నప్పుతుంది. ఎందుకంటే ఈ ఏడాది హార్థిక్ పాండ్యా చాలా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. కాగా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో హార్థిక్ భయంకరంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. అంతేకాకుండా ఆయన వ్యక్తిగత జీవితంలో భార్యతో విడాకులు తీసుకొని చాలా మనోవేధన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్ ఇండియా vs సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి పొట్టి కప్పును దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో హార్థిక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అయితే ICC తాజాగా ర్యాంకింగ్స్ విడుదల చేసింది. అయితే ఈ ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ల జాబితాలో హార్థిక్ పాండ్యా అగ్రస్థానంలో నిలిచారు. కాగా బౌలింగ్‌లో అక్షర్, కులదీప్ 7,8 స్థానాలు, బుమ్రా,అర్షదీప్ సింగ్ 12,13 స్థానాలు కైవసం చేసుకున్నారు.