Home Page SliderTelangana

 కేసీఆర్‌పై సస్పెండెడ్ బీఆర్‌ఎస్ నేతల ఘాటు వ్యాఖ్యలు

Share with

రెబల్ బీఆర్‌ఎస్ పార్టీ నేతలు జూపల్లి, పొంగులేటిలను ఈ ఉదయం పార్టీ సస్పెండ్ చేసింది. ఈ సస్పెషన్‌పై వీరిద్దరూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. చాలా కాలం నుండి వీరిద్దరూ పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ‘పార్టీనుండి విడుదల అవడం పంజరం నుండి పక్షి బయటకు వచ్చినంత స్వేచ్ఛగా ఉందని’ అంటున్నారు. మూడేళ్లుగా నేను పార్టీ సభ్యుడిగా లేనట్లే అనిపిస్తోందని, తన ప్రశ్నలకు జవాబులు చెప్పి సస్పెండ్ చేసి ఉంటే బాగుండేదన్నారు. తాను తెలంగాణా కోసం పోరాటాలు  చేశానన్నారు.  తన ఓటమికి ప్రభుత్వ పెద్దలే కారణమన్నారు. కేసీఆర్ ఫొటో ఇంట్లో పెట్టుకున్నాన్నారు. ‘వెయ్యికోట్లు పెట్టినా తనను కొనలేరని’ పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరే నాటికే తాను తెలంగాణా  వైసీపీ అధ్యక్షుడినని చెప్పారు పొంగులేటి. ‘ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా కేటీఆర్ కోసం తాను ఉన్నానన్నారు’. సీఎం మాయమాటలు నమ్మి మోసపోయాన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఓర్చుకున్నానన్నారు. పాలేరు ఉపఎన్నికలలో ఎంతో కష్టపడ్డానని, తనకు గుర్తింపు లేదని వాపోయారు. ఖమ్మంలో ఎన్నో కుటుంబాలు తనకు అండగా ఉన్నాయన్నారు.