Home Page SliderNational

హ్యాపీ బర్త్‌డే టు “మాస్ కా బాప్” ఎన్టీఆర్

Share with

ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. కాగా చిన్నప్పుడే సినిమాల్లోకి తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. తాను నేర్చుకున్నది కూచిపూడి నాట్యమే అయినా అన్ని రకాల డ్యాన్స్‌లను అద్భుతంగా చేసి అందరిచేత అదుర్స్ అనిపిస్తాడు. ఇక నటన విషయానికి వస్తే సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని నవరసాలను అలవోకగా పలికించి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఈ విధంగా ఎన్టీఆర్ తన నటన,స్టైల్‌,మేనరిజంతో టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు. కాగా RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాడు. ఈరోజు ఆయన బర్త్‌డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ నిన్న రాత్రి ఎన్టీఆర్ నివాసానికి చేరుకొని భారీ ఎత్తున హంగామా చేశారు. దీంతో నిన్న రాత్రి ఎన్టీఆర్ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

మరోవైపు ఎన్టీఆర్ కొత్త సినిమా “దేవర” నుంచి ఫస్ట్ లుక్‌ను కూడా చిత్రబృందం ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో సింహాద్రి సినిమాని రీరిలీజ్ చేశారు. దీంతో అభిమానులు థియేటర్ల వద్ద బాణాసంచా పేల్చి,నృత్యాలు చేస్తూ కోలాహలం చేశారు. ఎన్టీఆర్ మాస్ కా బాప్ అంటూ యంగ్ టైగర్ ఎల్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు చెప్తున్నారు.