NationalNews

కాసేపట్లో గుజరాత్ ఎలక్షన్ షెడ్యూల్

Share with

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ సన్నద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలున్నాయి. మెజార్టీ మార్క్ 92 స్థానాలు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో సమానంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లో మూడు దశాబ్దాలుగా బీజేపీ విజయాలు సాధిస్తూ వస్తోంది. ఈసారి రేసులో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం నిలవడంతో.. పోటీపై ఆసక్తి నెలకొంది.