NationalNews

‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ గొప్పమనస్సు

Share with

ఇటీవల ఆస్కార్ అవార్డు పొందిన భారత్‌కు చెందిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. జంట ఏనుగులకు తల్లిదండ్రులుగా మారిన వృద్ధ దంపతులు బొమ్మన్, బెల్లి దంపతుల జీవిత కథ ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా వీరు మరో ఘనత సాధించారు. తమిళనాడులోని ధర్మపురి అడవుల్లో నుండి తప్పిపోయిన మరో అనాథ ఏనుగుపిల్లకు తల్లిదండ్రులుగా మారబోతున్నారు. అటవీశాఖ అధికారుల అనుమతితో వారు ఈ నిర్ణయానికి వచ్చారు. తల్లి నుండి వేరుపడి, ప్రేమకు నోచుకోని ఈ మూగజీవిని పెంచుకుంటూ వారి జంతుప్రేమను, మంచిమనసును చాటుకున్నారు.