Home Page SliderNational

గ్రాండ్‌గా మెగా ప్రిన్సెస్ బారసాల

Share with

రామ్‌చరణ్-ఉపాసన ఈ నెల 20న ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా కాంపౌండ్‌లో సంబరాలు మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి-సురేఖల ముద్దుల మనవరాలు,రామ్‌చరణ్-ఉపాసనల గారాలపట్టికి ఇవాళ బారసాల ఫంక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బారసాల ఫంక్షన్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ మెగా కోడలు ఉపాసన ఓ వీడియోను తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే ఈ బారసాల ఫంక్షన్‌కు మెగా ఫ్యామిలీతోపాటు,అల్లుఅరవింద్ ఫ్యామిలీ,ఇతర సన్నిహితులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ బారసాల ఫంక్షన్‌లోనే మెగా ప్రిన్సెస్‌కు నామకరణం కూడా చేయనున్నారు. కాగా తన కూతురి పేరును ఫిక్స్ చేసినట్లు రామ్‌చరణ్ ఇప్పటికే వెల్లడించారు.అయితే  ఇవాళ అందరికీ మెగా ప్రిన్సెస్ పేరును ప్రకటించనున్నారు. దీంతో రామ్‌చరణ్-ఉపాసన కూతురి పేరు తెలుసుకోవాలని మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.