Andhra PradeshHome Page Slider

ఏపీలో ప్రభుత్వ,కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Share with

ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం జగన్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో బుధవారం నాడు జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ పెన్షన్ అమలు చేసేందుకు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసేందుకు ఏపీ క్యాబినెట్ పచ్చ జెండా ఊపి ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. దీంతో పాటు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 5 కీలక సిఫారసులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నిన్న కేబినెట్ భేటీ జరిగింది. కాగా నిన్న ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుని మొత్తం 63 ఆంశాలకు ఆమోద ముద్రవేశారు.

ఆ వివరాలని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వివరించారు.”ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా.. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒకటైన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్) ఉద్యోగుల కోసం సీపీఎస్ ను రద్దు చేసి దాని స్థానంలో ఏపీ జీపీఎస్(గ్యారెంటెడ్ పెన్షన్ స్కీం) బిల్లును అమలులోకి తీసుకురానున్నారు. మరి ముఖ్యంగా 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 12వ పీఆర్సీ ఏర్పాటు మరియు కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 12 శాతం నుంచి 16 శాతానికి పెంపున అంగీకారం తెలిపిన కేబినెట్.