Home Page SliderNational

బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్

Share with

మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. అదేంటంటే ఈ రోజు బులియన్ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు తగ్గాయి. కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400/- తగ్గడంతో రూ.55,200 గా ఉంది. అయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 /- తగ్గడంతో రూ.60,220 కు చేరింది. మరోవైపు వెండి ధర కేజీకి రూ.100/- తగ్గడంతో ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.77,700 పలుకుతోంది. ఈ మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలే కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రభావం కాస్త బంగారంపై పడి..బంగారం ధరలు అమాంతం పెరిగాయి.ఈ విధంగా ఆకాశాన్నంటిన బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో బంగారం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.