Home Page SliderNational

మంచి మనసు చాటుకున్న కాంతార హీరో

Share with

హీరో రిషబ్ శెట్టి కాంతార సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ సినిమాలో భూతకోల నృత్య కళాకారులు కష్టాలను ప్రపంచానికి తెలియజేశారు. దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం భూతకోల నృత్య కళాకారులకు ఆపన్న హాస్తం అందించింది. కాగా రిషబ్ శె్ట్టి సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా గొప్ప మనసు చాటుకున్నారు. తాజాగా ఆయన కర్ణాటకలోని తన స్వగ్రామం కెరడిలో ఉన్న  ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. కాగా ఆయన దీనికి తన “రిషబ్ శెట్టి ఫౌండేషన్” ద్వారా సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రిషబ్ శెట్టి గతంలో కూడా “సర్కారీ హై ప్రా షాలే”, “కాసరగాడు” సినిమా ద్వారా కన్నడ పాఠశాలల దుస్థితి గురించి అవగాహన కల్పించారు. కాగా ఈ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది.ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార-2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.