Home Page SliderNational

భారీగా పెరిగిన బంగారం ధరలు

Share with

 ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పెరుగుతుండడంతో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో బంగారం ధర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రూ.60,000/- దాటింది. అయితే ఈ రోజు మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో బులియన్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరగడంతో రూ.56,000కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.340 పెరిగి రూ.61,100గా ఉంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.1000 పెరిగడంతో రూ.78,600కు చేరింది. అయితే వెండి ధర 3 రోజుల్లో ఏకంగా రూ.2,100 పెరిగింది. కాగా పెరిగిన ఈ ధరలే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి.