Telangana

ఊగిసలాడుతూ ఊరిస్తున్న బంగారం ధరలు – ధంతేరస్‌ కొనుగోళ్లు

Share with

హైదరాబాద్ మనసర్కార్:

దీపావళికి ముందుగా వచ్చే ధనత్రయోదశి నాడు  బంగారం కొని, పూజించడం ఆనవాయితీ. అయితే ఈ సారి పసిడి ప్రేమికులు బంగారం కొనుగోలు విషయంలో అయోమయంలో పడిపోయారు. దేశీయ మార్కెట్‌లో ధరలు ఊగిసలాడుతున్నాయి. తగ్గుతూ, పెరుగుతూ ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో పసిడి ధరలు గ్రాముకి 130 రూపాయలు పెరిగింది. ఇప్పుడు 46,420 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకి 140 రూపాయలు తగ్గింది. గత పక్షం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు రాబోయే  పండుగల సందర్భంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 50,780 రూపాయలకు చేరుకుంది. దీపావళికి బంగారం కొనాలనుకుంటే నగల షాపులు ఇచ్చే బంగారం కొనుగోళ్ల ఆఫర్లపై దృష్టి పెట్టవచ్చు. ఇక వెండిధరలు కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి.  అక్టోబరు 5 నుండి 17 వరకూ కిలో వెండిపై ఏకంగా 5,850 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం నెమ్మదిగా ధరలు పుంజుకుంటున్నాయి.