Home Page SliderNational

ఇస్తే సీఎం పదవి ఇవ్వండి: డీకే

Share with

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.  అయితే కర్ణాటక సీఎం ఎవరు అనే దానిపై ఈ రోజు ఉదయం నుంచి తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు సీఎం ఎవరు అనే దానిపై స్పష్టత రాలేదు. కాగా కర్ణాటక సీఎం రేసులో ఉన్న సిద్దరామయ్య,డీకే శివకుమార్‌ల మధ్య ఓ రేంజ్‌లో పోటి కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారాన్ని పంచుకుందామని సిద్దరామయ్య ప్రతిపాదన తీసుకురాగా..డీకే శివకుమార్ దానికి ససేమీరా అన్నారు. అంతేకాకుండా డీకే పార్టీ కోసం నేను చాలా కష్టపడ్డాను. నాకు ఇస్తే సీఎం పదవి ఇవ్వండి. లేదంటే కేబినెట్‌లో స్థానం కూడా తనకు అక్కర్లేదని శివకుమార్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు నూర్జేవాలాతో జరిగిన మీటింగ్‌లో డీకే ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినట్టు సమాచారం. డీకే శివకుమార్‌తో నుర్జేవాలా మీటింగ్ 3 గంటల పాటు జరిగినప్పటికీ డీకే శివకుమార్ మాత్రం వెనక్కి తగ్గేదే లేదని చెప్పినట్లు నూర్జేవాలా వెల్లడించారు. దీంతో  డీకే ఢిల్లీ పర్యటనపై కూడా సందిగ్దత నెలకొంది.