National

పానీపూరీతో గజరాజు పార్టీ

Share with

ఈమధ్య సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు చాలా ఫేమస్ అవుతున్నాయి. కోతులు, కుక్కలు వంటి జంతువుల చేష్టలు నవ్వు కలిగిస్తూ ఉంటాయి. ఇప్పడు తాజాగా ఒక ఏనుగు పానీపూరీలు ఇష్టంగా లాగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పానీపూరీ బండివాడు ఒక్కొక్క పానీపూరీ ఇస్తుంటే తింటూ ఎంజాయ్ చేస్తోంది. మావటి పక్కకు తిప్పుతున్నా తొండం చాచి పానీపూరీని అందుకుంటోంది. పాపం ఆ బండి మొత్తం ఇచ్చినా దానికి చాలదని కామెంట్స్ పెడుతున్నారు కొందరు. ఏది ఏమైనా ఈ వీడియోతో ఆ వ్యాపారి బిజినెస్ పెరిగితే చాలు.