Andhra PradeshHome Page Slider

ఇస్రో అంతరిక్ష జైత్రయాత్రకు గగన్‌యాన్ కౌంట్‌డౌన్…

Share with

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్ విజయం అనంతరం మరో మైలు రాయిని దాటనుంది. అంతరిక్ష జైత్రయాత్రకు గగన్‌యాన్‌కు కౌంట్‌డౌన్ మొదలయ్యింది. నేటి సాయంత్రం శ్రీహరి కోటలోని షార్ రేంజ్‌లో రాత్రి 7.30 గంటలకు ఇది ప్రారంభమవుతోంది. రేపు ఉదయం 8 గంటలకు ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుండి దీనిని అంతరిక్షంలోనికి పంపనున్నారు. అంతరిక్షంలోకి మానవులను పంపే ఉద్దేశంతో తయారు చేసిన ఈ గగన్‌యాన్‌ మిషన్ను తయారు చేశారు.  2025లో పూర్తి స్థాయిలో సొంత రాకెట్‌తో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఎస్కేప్ సిస్టమ్‌ను పరీక్షించే పనిలో భాగంగా ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1ను రేపు అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇది తొమ్మిది నిముషాల పాటు సాగుతుందని, నాలుగు టెస్ట్ ఫ్లైట్‌లలో ఇది మొదటిదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇది శ్రీహర్ కోట నుండి 10 కిలోమీటర్ల దూరంలోని క్రూమాడ్యూల్ స్ప్లాష్ చేస్తారు. సముద్రంలో పడిన దీనిని రికవరీ షిప్‌ల ద్వారా భారత నావికా దళం సేకరిస్తుంది. ఈ విషయాన్ని ఇస్రో తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.