Home Page SliderInternational

టిక్‌టాక్‌పై ఆంక్షలు విధించిన ఫ్రాన్స్

Share with

ప్రపంచంలోని కొన్ని దేశాలు టిక్‌టాక్‌ను నిషేదిస్తే,మరికొన్ని దేశాలు దీనిపై పలు ఆంక్షలు విధించాయి. అయితే తాజాగా ఫ్రాన్స్ కూడా టిక్‌టాక్‌పై ఆంక్షలు విధించింది. ఈ యాప్ డేటా భద్రతకు ముప్పు కలిగిస్తున్నందున ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఫ్రాన్స్ దేశంలోని సివిల్ సర్వెంట్ల అధికారిక ఫోన్లలలో ఈ యాప్ వాడకాన్ని పూర్తిగా నిషేదించింది. అంతేకాకుండా టిక్‌టాక్‌తో సహా పలు రిక్రియేషన్ యాప్స్‌పై కూడా ఫ్రాన్స్ ఆంక్షలు విధించింది. అయితే ఆ మిగతా యాప్స్ ఏంటి అని వెల్లడించలేదు. కాగా వీటిలో ట్విటర్,ఇన్‌స్టాగ్రామ్,నెట్‌ఫ్లిక్స్ మొదలైనవి కూడా ఉన్నాయని తెలుస్తోంది.