Home Page SliderNational

ఎన్డీఏలోని నాలుగైదు పార్టీలు ఇండియా కూటమిలోకి

Share with

సెప్టెంబర్ 1న ముంబైలో ఇండియా కూటమి సమావేశం
బీజేపీని ఓడించడమే ఇండియా కూటమి లక్ష్యం
మోడీ సర్కారును గద్దె దించేందుకు కాంగ్రెస్ వ్యూహాలు
కాంగ్రెస్ ఒక్కటే కాదు, ఎవరిరికైనా నాయకత్వం !

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సమావేశానికి హాజరైన 38 పార్టీలలో నాలుగు నుండి ఐదు పార్టీలు ఇండియా కూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటిలో కొన్ని రానున్న రోజుల్లో ప్రతిపక్ష కూటమిలో చేరతాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలోక్ శర్మ బాంబు పేల్చారు. సెప్టెంబరు 1న ముంబైలో జరగనున్న ఇండియా కూటమి సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు కూడా ఆయన తెలిపారు. “ప్రధాని మోడీ ప్రసంగించిన ఎన్డీఏ సమావేశానికి హాజరైన 38 పార్టీలలో కనీసం 4 నుండి 5 రాజకీయ పార్టీలు ఇండియా కూటమి నేతలతో టచ్‌లో ఉన్నాయి. వాటిలో కొన్ని అతి త్వరలో ప్రతిపక్ష కూటమిలో చేరతాయని, మరికొన్ని (2024) ఎన్నికల ముందు ,” అంటూ అలోక్ శర్మ విలేకరుల సమావేశంలో అన్నారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమి సమావేశం గత నెలలో ఢిల్లీలో జరిగ్గా, కనీసం 38 పార్టీలు ఈ భేటీలో పాల్గొన్నాయి.

మహారాష్ట్రలో మహా వికాస్ అగాదీకి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందా అనే ప్రశ్నకు శర్మ నేరుగా సమాధానం ఇవ్వలేదు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, ఎవరు నాయకత్వం వహిస్తారనేది ముఖ్యం కాదు, మనమందరం కలిసి ఈ అహంకారపూరిత ప్రభుత్వాన్ని ఎలా తొలగించగలమన్నదే ముఖ్యమన్నారు. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలలో ఎవరైనా నాయకత్వం వహించవచ్చు, కానీ దేశంలోని అందరినీ ఏకం చేయడానికి కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో ఒక స్థిరమైన శక్తిగా పని చేస్తుంది. “2024 సంవత్సరం ఇండియా కూటమిదే” అని జాతీయ ప్రతినిధి చెప్పారు. ‘‘ఇటీవలి కాగ్ నివేదికలు, ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా), ఆరోగ్యం, బీమా రంగాల్లో వెలుగులోకి వచ్చిన అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణకు ఎప్పుడు ఆదేశిస్తారని ప్రధాని నరేంద్ర మోదీని అడగాలనుకుంటున్నాను. ” ఆయన అన్నారు.

2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారా అని ప్రశ్నించగా, ఈ లోక్‌సభ నియోజకవర్గం సంప్రదాయబద్ధంగా గాంధీ కుటుంబం పోటీ చేస్తుందని, స్థానిక ప్రజలకు వారితో కుటుంబ సంబంధాలు ఉన్నాయని అన్నారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేయాలని అమేథీ ప్రజలు కోరుకుంటున్నారని, అమేథీ నుంచి ఎవరు పోటీ చేస్తారో రాహుల్ గాంధీ, ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకుంటారని, ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. 2019 ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ విజయం సాధించారు. ఐతే ఈసారి ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్‌కు చెందిన బ్లాక్‌ లెవల్‌ ప్రెసిడెంట్‌ పోటీ చేసినా ఇరానీ ఓడిపోవడం ఖాయమని శర్మ తెలిపారు.