Home Page SliderInternational

ప్రియురాలికి 900 కోట్ల ఆస్తి రాసిన మాజీ ప్రధాని

Share with

‘ఎంతవారలైనా కాంతదాసులే’ అనే నానుడి ఖచ్చితంగా నిజమే అనిపిస్తుంది కొందరి తీరు చూస్తే. సాక్షాత్తు ఇటలీ  ప్రధానిగా సుదీర్ఘకాలం పరిపాలించిన సిల్వియో బెర్లుస్కోని కూడా దీనికి మినహాయింపు కాదు. 33 ఏళ్ల తన ప్రేయసి కోసం ఈ 86 ఏళ్ల మాజీ ప్రధాని ఏకంగా 100 మిలియన్ యూరోలు అంటే భారత కరెన్సీలో 900 కోట్ల రూపాయలకు పైనే ఆస్తిని వీలునామాలో రాసిచ్చారట. ఇటీవలే జూన్ 12న లుకేమియాతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాజకీయ నేతగా, వ్యాపార వేత్తగా ఎంతో అనుభవం ఉన్న ఆయన ఆస్తుల విలువ దాదాపు 6 బిలియన్ యూరోలు. అంటే దాదాపు 54 వేల కోట్ల రూపాయలు.

ఆయన వీలునామాను ఆయన సంతానం, సాక్ష్యుల సమక్షంలో చదివిన లాయర్లే ఆశ్చర్యపోయారు. ఇద్దరు భార్యలు, ఐదుగురు సంతానం గల ఆయన వారందరితో పాటు తన సోదరుడికి, ప్రియురాలికి కూడా ఆస్తిని రాసిచ్చాడు. 33 ఏళ్ల ఫాసినా అనే పార్లమెంట్ దిగువ ఛాంబర్‌లో 2018 నుండి సభ్యురాలిగా కొనసాగుతున్న ఆమెతో ఆయనకు బంధం ఉంది. వివాహం చేసుకోకపోయినా ప్రియురాలిగా ఆమెకు సముచిత స్థానం కల్పించారు. ఆయన స్థాపించిన ఫోర్జా ఇటాలియా అనే పార్టీలో కూడా ఆమె సభ్యురాలిగా ఉన్నారు. దీనితో ఆమెకు ఈ 900 కోట్ల ఆస్తి దక్కింది.