Home Page SliderNational

కేరళ మాజీ సీఎం మృతి

Share with

కేరళ మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (79) బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత కొంతకాలంగా  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు ఊమెన్ చాందీ. ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు కేరళకు సీఎంగా పనిచేశారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఒక గొప్పనేతను కోల్పోయామన్నారు. ఆయన ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసారని, కేరళ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని మోదీ తెలిపారు. తాను గుజరాత్ సీఎంగా ఉండేటప్పుడు ఆయన కేరళ సీఎంగా ఉండేవారని, తమ మధ్య చాలా చర్చలు జరిగాయని మోదీ పేర్కొన్నారు. చాందీతో కలిసి ఉన్న ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. 1943లో కొట్టాయం జిల్లాలో కొమర్ కోమ్ అనే గ్రామంలో జన్మించారు చాందీ. సాధారణ కాంగ్రెస్ కార్యకర్తగా చేరినప్పటికీ తన చిత్త శుద్దితో పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. 1970 లో తొలిసారి పూతుపల్లి నియోజకవర్గం నుండి గెలిచిన ఆయన 12 సార్లు అదే నియోజక వర్గం నుండే విజయం సాధించారు. 2004-2006, 2011-2016 కాలంలో ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఏనాడూ పార్టీ మారలేదు. నియోజక వర్గం కూడా మారలేదు.