Home Page SliderTelangana

జూరాల ప్రాజెక్టుకు జలకళ

Share with

తెలంగాణాలోని జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. కాగా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. అయితే ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి,నారాయణపూర్‌ డ్యామ్‌లకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు ఆ వరద నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 7,211 క్యూసెక్కులు,ఔట్‌ఫ్లో 139 క్యూసెక్కులుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం జలాశయంలో 5 టీఎంసీల నీరు ఉన్నట్లు సమాచారం. ఈ వరద ప్రవాహం ఇలానే కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు వెల్లడించారు.