Home Page SliderTelangana

తెలంగాణలో భారతీయ న్యాయసంహిత చట్టంతో నమోదైన తొలి కేసు

Share with

నేటి నుండి కొత్త భారతీయ న్యాయచట్టాలు అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టంలో భాగంగా నేడు తెలంగాణలో తొలి కేసు నమోదయ్యింది. హైదరాబాద్‌లోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న బైకర్‌పై డిజిటల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 281 బీఎన్‌ఎస్, ఎంవీ యాక్ట్ కింద కేసు పెట్టారు. కాలం చెల్లిన బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీఎస్)కు బదులుగా ఈ బీఎన్‌ఎస్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ఐపీఎస్‌కు కాపీ, పేస్ట్ పద్దతిలోనే ఉందని విమర్శిస్తున్నాయి.