Home Page SliderTelangana

హబ్సిగూడలోని మాల్‌లో అగ్నిప్రమాదం- ఆందోళనలో స్థానికులు

Share with

హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడలో ఒక మాల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ అన్‌లిమిటెడ్ వస్త్ర దుకాణం, పై అంతస్తులో రెస్టారెంట్ ఉన్నాయి. దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా ఉండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ముందుగా టేస్ట్ ఆఫ్ ఇండియా అనే హొటల్‌లో అనే పై అంతస్తులోని రెస్టారెంట్లో మంటలు అంటుకున్నాయని, ఇవి అన్‌లిమిటెడ్ బట్టల షోరూంకు కూడా వ్యాపించాయని పేర్కొన్నారు. ఈ రెస్టారెంట్లో నాలుగు గ్యాస్ సిలెండర్లు ఉన్నాయని చెప్తున్నారు. దీనితో నాగోలు నుండి హబ్సిగూడా వరకూ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.