Home Page SliderNational

కర్ణాటకలో అమిత్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు

Share with

కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ అధికార,ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. ప్రచారంలో భాగంగా అధికార,ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. దీంతో ప్రస్తుతం కర్ణాటకలో యుద్ధ వాతావరణం కన్పిస్తోంది. అయితే ఎన్నికల ప్రచారంలో కాస్త ముందున్న బీజేపీ పార్టీకీ ప్రతిపక్షాల నుంచి షాక్ తగిలింది. అదేంటంటే బీజేపీ నేత,కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో పర్యటించిన అమిత్ షా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. కాగా రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు చెలరేగుతాయన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు డీకే శివకుమార్, పరమేశ్వర్ బెంగుళూరు  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అమిత్ షా తన ప్రసంగాలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఎఫ్ఐఐర్‌లో పేర్కొన్నారు. కాగా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులను కోరారు.