Home Page SliderInternational

క్యాన్సర్ బారిన పడ్డ ప్రముఖ క్రికెటర్

Share with

ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ క్రికెట్ వికెట్ కీపర్,బ్యాటర్ సామ్ బిల్లింగ్స్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా తాను చర్మ సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు బిల్లింగ్స్ స్వయంగా వెల్లడించారు. క్రికెట్ ప్లేయర్స్ వారి ఆటలో భాగంగా ఎక్కువ సమయం సూర్యరశ్మిలోనే ఉండాల్సివుంటుంది. అయితే దీనివల్ల తలెత్తే సమస్యల గురించి తన సహచరుల్లో  అవగాహన కల్పించాలనుకుంటున్నానని బిల్లింగ్స్ తెలిపారు. తన చాతి దగ్గర చర్మంలో లోతైన క్యాన్సర్ కణితి పెరిగిందన్నారు.ఒకవేళ ఇది పెద్దదై ఉంటే చాలా ప్రమాదం అయ్యేదన్నారు. దానిని  కీలక సమయంలో గుర్తించి స్ర్కీనింగ్ చేయించుకోవడంతో ముప్పు తొలగిందన్నారు. బయటకు కన్పిస్తున్నట్లు క్రికెట్ అంతా బాగుంటుందని కాదన్నారు. క్రికెట్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్లు మాత్రమే కాకుండా క్లబ్ స్థాయి క్రికెటర్లు కూడా తమ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని బిల్లింగ్స్ సూచించారు. కాగా 31 ఏళ్ల బిల్లింగ్స్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవడానికి  గత ఏడాదిలో రెండు సార్లు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇప్పటివరకు బిల్లింగ్స్ ఇంగ్లాండ్ తరుపున 3 టెస్టులు ,28 వన్డేలు, 37 T20లు ఆడాడు.