Andhra PradeshNationalNews Alert

ఫేక్ యూనివర్సిటీలు- పనికిరాని డిగ్రీలు

Share with

దేశంలో నకిలీ యూనివర్సిటీలు కలకలం రేపుతున్నాయి. దేశంలో మొత్తం 22 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని, వాటిలో రెండు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని యూజీసీ పేర్కొంది. వాటిలో ఒకటి గుంటూరు కాకుమానువారితోటలోని క్రైస్ట్ న్యూటెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, మరొకటి విశాఖపట్టణం ఎన్జీవోస్ కాలనీలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా.

ఈ యూనివర్సిటీలకు డిగ్రీ పట్టాలు ఇచ్చే అధికారం లేదని యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్ రజనీష్ జైన్ పేర్నొన్నారు. దేశంలోనే అత్యధికంగా ఢిల్లీలో 8 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు UGC  తెలియజేసింది. ఉత్తరప్రదేశ్‌లో 4, పశ్చిమబెంగాల్లో 2, ఒడిస్సాలో 2, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలలో ఒక్కో నకిలీ యూనివర్సిటీ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలలో చదివేవారి డిగ్రీలు చెల్లుబాటు కావని యూజీసీ పేర్కొంది.