Home Page SliderNational

జేబులో పేలిన మొబైల్ ఫోన్

Share with

ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లు పేలాయన్న వార్తలు వింటూనే ఉన్నాము. కాగా వీటిలో ఎక్కువ మొబైల్స్ ఛార్జింగ్ పెట్టి, గేమ్స్ ఆడే సమయంలో పేలాయి. అయితే ఓ మొబైల్ ఫోన్ మాత్రం ఓ వ్యక్తి జేబులో పేలింది. దీంతో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. కోజికోడ్‌కు చెందిన ఫారిస్ రెహమాన్ రైల్వేలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా అతను ముఖం కడుక్కునేందుకు వాష్‌రూమ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అతని జేబులో ఉన్న రియల్ మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడ ఉన్న తోటి కార్మికులు మంటలు ఆర్పి ,అతన్ని హస్పటల్‌కు తరలించారు. అయితే దీనిపై బాధితుడు వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. దేశంలో పలుమార్లు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా నాణ్యత ప్రమాణలు లేని మొబైల్ ఫోన్ల వాడకం వల్లే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.