News AlertTelangana

పేలిన గ్యాస్ సిలిండర్

Share with

సికింద్రాబాద్‌లో భారీ పేలుడు ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఓ అపార్ట్‌మెంట్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఈ పేలుడు సంభవించినట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపగా.. గ్యాస్ సిలిండర్‌లోని గ్యాస్ లీకయ్యిందని అందువల్లే పేలుడు సంభవించిందని పోలీసులు స్పష్టం చేశారు. ఆ సమయంలో ఇంటిలోనే ఉన్న ఇద్దరు దంపతులకు తీవ్ర గాయాలయ్యాయని , వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారమిచ్చారు. ఈ పేలుడులో అపార్ట్‌‌మెంట్‌లోని కొంత భాగం నాశనమైనట్టు తెలుస్తోంది.

Read more: KGF రాఖీభాయ్‌ స్ఫూర్తితో నలుగురిని చంపాడు