Andhra PradeshHome Page Slider

10వ తారీకు కూడా పోయే: జీతాలు ఇవ్వకపోతే ఎలా?

Share with

ఉపాధ్యాయులు, ఉద్యోగులకు జీతాలు, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వకపోతే ఎలాజీవించాలని ఏపీ టీచర్ల సమాఖ్య (ఎపీటీఎఫ్) ప్రశ్నించింది.

అమరావతి: టీచర్లు, ఉద్యోగులకు జీతాలు, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వకపోతే ఎలా జీవించాలని ఏపీ టీచర్ల సమాఖ్య (ఎపీటీఎఫ్) ప్రశ్నించింది. 10వ తేదీ వచ్చినా ఇంతవరకు జీతాలు పడలేదని తెలిపింది. టీచర్ల బదిలీలు, సర్దుబాటు కారణంగా కేడర్ స్ట్రెంత్ పూర్తి కాకపోవడంతో 5 వేల మందికి మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. జీతం, పింఛన్లు ఒకటో తేదీన రాకపోవడం ఆనవాయితీగా మారిపోయింది అని ఒక ప్రకటనలో మంగళవారం విమర్శించింది.