Home Page SliderTelangana

SSC పేపర్ లీక్ కేసులో పోలీసులకు ఈటల స్టేట్‌మెంట్

Share with

తెలంగాణాలో ఇటీవల కాలంలో TSPSC పేపర్ లీక్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే తెలంగాణాలో మళ్లీ 10 వ తరగతి పేపర్ కూడా లీక్ అయ్యింది. దీంతో తెలంగాణాలో రాజకీయ రగడ ప్రారంభమైందనే చెప్పాలి. కాగా రాష్ట్రంలోని అధికార,ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అయితే ఈ పేపర్ లీక్‌లో ప్రధాన నిందితులుగా ఉన్న పలువురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

అయితే ఈ కేసులో తెలంగాణా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు SSC పేపర్ కేసులో DCP కార్యాలయంలో పోలీసులకి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆయన తన ఫోన్ ను పోలీసులకి ఇచ్చి.. వారికి కావాల్సిన సమాచారం ఇచ్చారని సమాచారం. దీనిలో పోలీసులు నోటీసులో పేర్కొన్న ఫోన్ నంబర్ నుండి ఈటలకు ఎలాంటి వాట్స్ ఆప్ మెసేజ్ రాలేదని పోలీసులు గుర్తించారు. అయితే వేరే నంబర్ నుండి వచ్చిన మెసేజ్ కూడా ఆయన ఓపెన్ చేసి చూడలేదు అని పోలీసులకి ఈటల వివరణ ఇవ్వగా..ఇదే విషయాన్ని పోలీసులు నిర్ధారించుకున్నారు.

అయితే పోలీసులకు స్టేట్‌మెంట్  ఇచ్చిన అనంతరం బయటికి వచ్చిన ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..నాకు ఎలాంటి వాట్స్ ఆప్ కాల్ రాలేదన్నారు. వచ్చిన మెసేజ్ కూడా ఓపెన్ చేసి చూడలేదన్నారు. 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానన్నారు. పరీక్షల సమయంలో ఒక ప్రధాన మంత్రి నేరుగా విద్యార్థులతో మాట్లాడి  ధైర్యం చెప్తున్నవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్క నరేంద్ర మోడీ మాత్రమేనన్నారు. అయితే అలాంటి పార్టీలో నేను ఉన్నానని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. అంతేకాకుండా మా పార్టీ పిల్లల భవిష్యత్తు కోరే పార్టీ అన్నారు. తెలంగాణాలో 10వ తరగతి పరీక్షలు 9.30 కి మొదలు అయితే 11 గంటల తరువాత పేపర్ బయటికి వస్తే దానిని పేపర్ లీక్ ఎలా అంటారు?  అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సీఎం కేసిఆర్ ప్రగతి భవన్‌లో కూర్చొని ఎలా అయిన మమ్ముల్ని  ఇరికించాలని కుట్ర పూరితంగా మా మీద కేసులు పెట్టించారన్నారు. TSPSC ఆరు పరీక్ష పేపర్స్ లీక్ అయ్యాయో చెప్పాలన్నారు. అయితే దానిపై దుష్ప్రచారం జరుగుతుందని  దానిని డైవర్ట్ చెయ్యడానికే మాపై ఈ కేసులు పెట్టారన్నారు. తాను కేసీఆర్‌ని ఓడించేంతవరకు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేవరకు ప్రజలకు అండగా ఉంటానని ఈటల హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇది ఒక అక్రమ కేసు అని.. TSPSC పేపర్ లీకు నుండి డైవర్ట్ చేయడానికే ssc కేసు పెట్టారని ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.