Home Page SliderNational

బాంబు ఉందంటూ ఢిల్లీలో స్కూలుకు ఈమెయిల్- స్కూలును చుట్టుముట్టిన పేరెంట్స్

Share with

ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని సాధిక్‌నగర్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూలులో బాంబు ఉందంటూ యాజమాన్యానికి ఈమెయిల్ వచ్చింది. స్కూలులోని పిల్లలను ఖాళీ చేయించాల్సిందిగా కూడా ఆమెయిల్‌లో పేర్కొన్నారు. అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందివ్వగా, వారు స్కూలు పరిసరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకూ ఏమీ దొరకలేదని సమాచారం. స్కూలు బయట విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దఎత్తున గుంపులుగా చేరారు. స్కూలు నుండి తమ పిల్లలను తీసుకెళ్లమంటూ మెసేజ్ వచ్చిందని వారు చెపుతున్నారు. ఈ ప్రదేశానికి వచ్చిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ చందన్ చౌదరి మాట్లాడుతూ..ఇలాంటి మెయిల్స్, ఫోన్లు రావడం కొత్త కాదని, కొన్ని హాక్స్ మెయిల్స్ గతంలో కూడా వచ్చాయని పేర్కొన్నారు. పోలీసుల బృందం, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అక్కడ పరిశీలిస్తున్నాయని, కంగారు పడవద్దని పేరెంట్స్‌ను సమాధానపరిచారు.