InternationalNews

సేల్స్ మేన్ అవతారంలో ఎలాన్ మస్క్

Share with

సెలబ్రెటీస్ ఏం చేసినా వింతే. అందులోనూ ప్రపంచ కుబేరుడైన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన ట్లీట్స్ క్షణంలో వైరల్ అవుతుంటాయి. ఈ మధ్యనే తాను లాంచ్ చేసిన బర్న్ట్ హెయిర్ పెర్‌ఫ్యూమ్‌ను ప్రమోట్ చేస్తూ ఆయన ట్విట్టర్‌లో పెట్టిన ట్వీట్ పలు సంచలనాలకు దారితీసింది. దీనిలో ఆయన తాను సేల్స్‌మేన్‌గా చెప్పుకుంటూ తన బ్రాండ్ పెర్‌ఫ్యూమ్‌ను కొనండని వేడుకుంటూ, మీరు ఇది కొంటే నేను ట్విట్టర్‌ను కొనుక్కుంటానని కోరుకున్నాడు. ఈ ట్వీట్‌పై ట్వీట్ల కుంభవృష్టి కురుస్తోంది. 25 వేలకు పైగా రీట్వీట్లతో వైరల్ అయ్యింది. 20 వేల బాటిల్స్ సేల్ అయ్యాయి. దీనివల్ల ట్విట్టర్ కొనుగోలు అంశం మరోసారి తెలపైకి వచ్చినట్లయ్యింది. గత ఏడాది 44 బిలియన్ డాలర్ల ట్విట్టర్ డీల్‌ను ప్రకటించాడు. కానీ ట్విట్టర్‌పై నకిలీ ఖాతాల విషయంలో విమర్శలు చేసి ఈ డీల్‌ను ఉపసంహరించుకున్నాడు. చివరకు కోర్టుకు చేరిన ఈ వ్యవహారంలో మస్క్‌కు కోర్టు అక్టోబరు నాటికి పూర్తి చేయాలని సమయం ఇచ్చింది.

కాగా పెర్‌ఫ్యూమ్ బిజినెస్‌లో ప్రవేశించానని, ఈ ఓమ్ని జెండర్ పెర్‌ఫ్యూమ్ అందరికీ బాగుంటుందని వెల్లడించిన మస్క్, లాంచ్ చేయగానే 10 వేల బాటిల్స్ సేల్ అయ్యాయని గొప్పలు పోయాడు. అయితే దాని అమ్మకాల కోసం ఇంత అడుక్కోవడం ఎందుకో అంటూ విమర్శకులు వెల్లువెత్తుతున్నాయి. మస్క్ సేల్స్‌మేన్‌లా తయారయ్యాడంటూ గుసగుసలు మొదలు పెట్టారు.