Home Page SliderNational

రాజ్యసభ ఖాళీలకు త్వరలో ఎన్నికలు

Share with

పదవీకాలం పూర్తికానున్న 4 రాజ్యసభ సభ్యుల స్థానాలకు జనవరి 19న ఎన్నిక జరగబోతోంది. దేశరాజధాని ఢిల్లీలో, సిక్కిం రాష్ట్రానికి సంబంధించి నాలుగు రాజ్యసభ సీట్ల కోసం వచ్చే నెల 19న ఎన్నికలు నిర్వహిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఢిల్లీలో మూడు స్థానాలు ఖాళీ అవుతుండగా, సిక్కింకు సంబంధించిన రాజ్యసభ సీటు ఒకటి ఖాళీ కానుంది. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలని అందరికీ తెలుసు. ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్, సుశీల్ కుమార్ గుప్తా, నరేన్ దాస్ గుప్తాల పదవీ కాలం జనవరి 27న పూర్తి కానుంది. వీరి స్థానంలో మరో ముగ్గురిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక సిక్కింకు చెందిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ తరపున  లచ్చుంగ్ పా పదవీ కాలం ఫిబ్రవరి 23తో ముగియనుంది. అందుకే ఈ నాలుగు స్థానాలకు కలిపి జనవరి 19న ఎన్నికలు పెట్టాలని ఎలక్షన్ కమీషన్ నిర్ణయించింది. వీరిలో ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ సింగ్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈయన రాజ్యసభ నుండి జూలై 24 నుండి ప్రవర్తన కారణంగా సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ రాజ్యసభ ఖాళీలకు నామినేషన్లు జనవరి 2 నుండి మొదలవుతాయని, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆఖరి తేదీ జనవరి 9 అని ఎలక్షన్ కమీషన్ శుక్రవారం ప్రకటించింది.