NewsTelangana

ఈడీ అదుపులో… క్రిప్టో కరెన్సీ బ్రోకర్ ఆశిష్ మాలిక్

Share with

తెలంగాణాలో క్రిప్టో కరెన్సీ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా జంట నగరాలను టార్గెట్ చేసుకుని కేటుగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ పేరుతో హైదరాబాద్‌లో మోసాలకు పాల్పడుతున్న అశిష్ మాలిక్ ఆట కట్టించడానికి ఈడీ సిద్దమైంది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్‌లో ఆశిష్ మాలిక్‌ను అరెస్టు చేసింది. అనంతరం ఈడీ అశిష్ మాలిక్‌ను రిమాండ్‌కు పంపింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ గతకొన్ని రోజులుగా అశిష్ మాలిక్ మోసాలకు పాల్పడుతున్నాడు. దాదాపు వెయ్యిమంది నుంచి రష్యన్ ఆయిల్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో మోసాలకు తెరతీశాడు. ఈ మేరకు అశిష్ మాలిక్ ఇప్పటినరకు వారి నుంచి రూ.52కోట్ల రూపాయలు దోచుకున్నట్లు తెలుస్తోంది.