Home Page SliderNational

ఎన్నికల ఫలితాల జోరుతో క్రాష్ అయిన ఈసీ వెబ్‌సైట్..

Share with

నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలుసుకోవాలనే తొందరలో అత్యధికులు ఈసీ వెబ్ సైట్‌పై దృష్టి పెట్టారు. దీనితో అమాంతం వీక్షకుల సంఖ్య పెరిగి ఎన్నికల కమీషన్ వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. దీనితో తమకు  ఈ వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదంటూ సోషల్ మీడియాలో పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. దీనితో ఎన్నికల సంఘం దీనిని పరిశీలిస్తున్నామని విజ్ఞప్తి చేసింది.  ఈ ఫలితాలలో తెలంగాణాలో ఇప్పటికే కాంగ్రెస్ రెండుస్థానాలలో గెలుపొందింది. తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల అనంతరం జాతీయపార్టీ కాంగ్రెస్ ఆధిక్యతలో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ 157 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 70 స్థానాలలోనూ, ఇతరులు 3 స్థానాలలోనూ కొనసాగుతున్నారు. ఛత్తీస్ ఘడ్‌లో కూడా బీజేపీ 54 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 34 స్థానాలలోనూ, ఇతరులు 2 స్థానాలలోనూ ముందంజలో ఉన్నారు.  రాజస్థాన్‌లో కూడా అధికార పార్టీ కాంగ్రెస్‌ను వెనక్కునెట్టి బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 76 స్థానాలలో ఉండగా, బీజేపీ 106 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది.