Home Page SliderNational

చదువుకుంటూనే ఇలా సంపాదించండి (Earn while Learn) గొప్ప స్కీమ్

Share with

భారత్‌లోని ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది కేంద్రప్రభుత్వం. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు తమ చదువులకు కావలసిన డబ్బును తామే సంపాదించుకునేలా, ప్రభుత్వం ‘నేర్చుకుంటూనే సంపాదించండి (Earn while learn)’ అంటూ మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమెరికా,బ్రిటన్  వంటి పాశ్చాత్యదేశాలలో ఈ విధానం పాటిస్తున్నారు విద్యార్థులు. పాఠశాల చదువు పూర్తి కాగానే, యూనివర్సిటీలలో చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూంటారు. కానీ భారత్‌లో ఇలా పనులు చేసే సమయం ఉండదు, చిన్నతనంగా కూడా భావిస్తూంటారు కొందరు. కాలేజీ పనివేళలు  దాదాపు 8 నుండి 10 గంటల వరకూ ఉంటాయి ఇక్కడ. అక్కడ నాలుగైదు గంటలు మించి కాలేజి ఉండదు. దీనితో సమయం దొరుకుతుంది.

ఇప్పుడు ఈ పథకంలో విశ్వవిద్యాలయాలే విద్యార్థులకు చదువుతో పాటు పని కల్పిస్తాయి. వారానికి 20 గంటల పాటు నెలలో 20 రోజులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కలిపిస్తోంది. దీనికి ప్రతిఫలం నిర్ణయించడానికి వీలుకల్పించే ముసాయిదాను కూడా యూజీసీ ఇప్పటికే ప్రతిపాదించింది. గ్రంథాలయం పనులు, కంప్యూటర్ సేవలు, ప్రయోగశాలల్లో సహాయం అందించడం, డేటాఎంట్రీ వంటి పనులు అర్హులైన విద్యార్థులకు కల్పిస్తూ వారి సేవలు వినియోగించుకోవడంతో పాటు వారికి ఆదాయాన్ని కూడా కల్పిస్తారు. ఇలా డిగ్రీతో పాటు వారికి ఉద్యోగజీవితం కూడా అలవాటవుతుంది. వారి సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం, టైమ్ మేనేజ్‌మెంట్, వారు స్వయంగా సంపాదించిన డబ్బు విలువ తెలుసుకోగలుగుతారు. బాధ్యత పెరుగుతుంది. తద్వారా కొన్ని సంఘవ్యతిరేకశక్తుల కోసం విద్యార్థులను ఉపయోగించుకునే పరిస్థితికి కూడా అడ్డుకట్ట పడుతుందని చెప్పవచ్చు.