Home Page SliderTelangana

‘బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ పరీక్ష కూడా లీకేజీ లేకుండా జరగలేదు’..రేవంత్ రెడ్డి

Share with

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏనాడూ బాధ్యతగా పరీక్షలు నిర్వహించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. పదవ తరగతి మొదలు ఇంటర్మీడియట్, టీఎస్‌పీఎస్సీ పరీక్షలు వంటి ఏ పరీక్ష కూడా లీకేజీ లేకుండా లేదన్నారు. పదవ తరగతి పరీక్షలు పరీక్షకు ముందే వాట్సాప్‌లో చక్కర్లు కొట్టేవని, ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేయలేక, మిత్రులైన అవుట్ సోర్సింగ్‌కు అప్పగించి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్నారు. 25 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. ఇక టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికాయని ఎద్దేవా చేశారు. ఎంతోమంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలను దూరం చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు ఎన్నో ప్రదేశాల నుండి హైదరాబాద్ కోచింగ్ సెంటర్లకు వచ్చి పరీక్షల కోసం ప్రిపేర్ అయిన వారు  నాటి ప్రభుత్వ విధానాలతో విసిగి పోయారన్నారు.