Home Page SliderTrending Today

ఎన్టీఆర్ 30 నుండి డబుల్ ధమాకా అప్‌డేట్

Share with

RRR మూవీకి ఆస్కార్ వచ్చాక యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా ఖుషీగా ఉన్నారు. ఈ దూకుడుతోనే ఎన్టీఆర్ 30 సినిమాలో జోరుగా షూటింగ్ చేసుకుంటున్నారు. సూపర్ హిట్ చిత్రం జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సముద్రతీర ప్రాంత ప్రజల కష్టనష్టాలను ఈ చిత్రంలో చూపిస్తారని టాక్. కాగా దివంగత అందాలతార శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ తార జాన్వీకపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా మొదటిసారి తెలుగులో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఈ మధ్య ఎన్టీఆర్ బర్తడే సందర్భంగా విడుదలైన ఓ వీడియోలో ‘ధైర్యానికి కూడా తెలియదు, అవసరానికి మించి తానుండకూడదని… అప్పుడు భయానికి తెలియాలి తాను రావల్సిన సమయం వచ్చిందని వస్తున్నా’ అంటూ సాగే డైలాగ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.