Andhra PradeshHome Page Slider

చుక్కల భూములు రైతన్నలకే -కావలిలో జగన్ హామీ

Share with

రైతన్నకు చుక్కలభూములపై సర్వహక్కులు అందజేస్తున్నామని, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఎప్పుడో వందేళ్ల క్రితం జరిగిన సర్వేల ఆధారంగా రెవెన్యూ రికార్డులలో లేని భూములను చుక్కల భూములుగా పేర్కొంటున్నారు. కానీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా రెండు లక్షల ఆరువేల ఎకరాల భూమి ఇలా చుక్కల భూమిగా మిగిలిపోయింది. వేల మంది రైతులు వాటిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి దశాబ్దాలు గడిచినా ఆ భూములపై హక్కు లేకుండా ఆ రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి భూములను కలెక్టర్ల ద్వారా గుర్తించి, రెవెన్యూ రికార్డులలో మార్పులు చేసి, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ భూముల పట్టాలను వారికే ఇప్పిస్తున్నాన్నారు జగన్. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఈ చుక్కల భూములను, షరతులు గల పట్టా భూములను నిషేధిత జాబితాలలో చేర్చి,రైతులకు అందకుండా చేశారని జగన్ మండిపడ్డారు. వేలమంది రైతులకు ఈ భూముల సమస్య నుండి శాశ్వత పరిష్కారం చేస్తున్నానని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా 17,476 రెవెన్యూ గ్రామాలలో సర్వేలు నిర్వహించి, భూములను అప్ డేట్ చేసి, పట్టాలను రైతులకు అందిస్తున్నామన్నారు. నిషేధిత జాబితాల నుండి చుక్కల భూములను అంచెలంచెలుగా తొలగిస్తున్నామన్నారు. ఇవన్నీ రైతులకు మంచి జరగాలని ఆశిస్తున్నామని,  రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తమదని భరోసా ఇచ్చారు. రైతులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు.