Home Page SliderInternational

కోహ్లికి ఓపెనింగ్ ఇవ్వొద్దు..నెటిజన్ల మీమ్స్

Share with

క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లికి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా పంపొద్దంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంపై పలు మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఓపెనింగ్ కాకుండా 3వ స్థానంలో అతడిని బ్యాటింగుకు పంపాలని కోరుతున్నారు. ఈ టీ20 మ్యాచ్‌లలో విరాట్ తన కెరీర్‌లోనే అతి తక్కువ పరుగులు చేశారు. ఈ సీజన్‌లో ఏకంగా 2 సార్లు డకౌట్ అయిన చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీనితో అతని ఫామ్‌పై అభిమానులలో ఆందోళన నెలకొంది.ఈ టోర్నీలో విరాట్ స్కోర్లు 1,4,0,24,37,0 గా ఉన్నాయి. దీనిపై సీనియర్ క్రికెటర్లు కూడా అతడి ఆటతీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. అతడి బ్యాలెన్స్ సరిగ్గా లేదని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించారు. అతడిని ఓపెనర్‌గా పంపకూడదనే సలహాను ఇచ్చారు.