Home Page SliderInternational

లక్కు పట్టిన కుక్క

Share with

కుక్కే కదా అని తీసిపారేయకండి. ఒక కుక్కకి పట్టిన లక్కు సాధారణంగా లేదు. ఈ ఊరకుక్క కథ వింటే ఎంత అదృష్టమో అనిపిస్తోంది. తిండి కోసం ప్రతి ఇంటా వెంపర్లాడుతూ తిరిగే ఈ ఊరకుక్కకి విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. ఏకంగా ఇటలీకి దత్తత వెళ్తోంది ఈ కుక్క. కాలు విరిగి కుయ్యో మొయ్యోమంటూ రోడ్డుపై తిరిగే ఈ కుక్కను ఒక స్వచ్ఛంద సంస్థ చేరదీసి, వైద్యం చేయించింది. దానికి మోతీ అని పేరు కూడా పెట్టి దాని ఆరోగ్యం నయమయ్యేలా చేసింది. దీని అదృష్టం అంతటితో ఆగలేదు. ఇటలీ నుంచి కథలు రాయాడానికి వచ్చిన ఒక రచయత్రి కంట పడింది. దానిని చూసి జాలిపడిన ఆమె దానిని పెంచుకోవాలనుకుని, ఆ స్వచ్ఛంద సంస్థను కోరింది. వారి అంగీకారంతో దానికి డబ్బు ఖర్చు పెట్టి పాస్‌పోర్ట్, వీసా తయారు చేయించింది. ఇంకేముంది? ఈ కుక్క ఖుషీగా జూలై 13న దిల్లీ నుండి ఇటలీకి విమానమెక్కబోతోంది.