Home Page SliderNational

యూపీలో జోరుగా సాగుతున్న ‘గాడిదల సంత’

Share with

ఉత్తరప్రదేశ్‌లోని ‘సీత్లాధామ్‌’లో గాడిదల సంత జోరుగా సాగుతోంది. గాడిదలు, గుర్రాలు అమ్మకాలు, కొనుగోళ్లకు ప్రసిద్ధి చెందిన ‘గార్ధభ మేళా’, కౌసంభి జిల్లాలో ప్రారంభమైంది. దాదాపు వెయ్యిరకాల జాతులకు చెందిన గాడిదలు, గుర్రాలు పంజాబా, హర్యానా, బీహార్ నుండి వేల సంఖ్యలో వచ్చాయి. గాడిదల మేళా ఏంటి అని తేలిగ్గా తీసుకోకండి. ఇవి దాదాపు ఐదు వేల రూపాయల నుండి ఏభై వేల రూపాయల వరకు ధర పలుకుతున్నాయట. ఈ మేళా ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా జరుపుతున్నారట. ఈ సంవత్సరం జమ్ము కాశ్మీర్ నుండి మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల నుండి కూడా వర్తకులు వచ్చారని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ గాడిదల జాతులలో ‘టిపు’ అనే జాతి గాడిదకు డిమాండ్ చాలా ఎక్కువట. ఎంత ధరైనా ఇచ్చి వీటిని కొనుగోలు చేయడానికి పోటీ పడుతుంటారు. ఈ గాడిదలను  రజకులు, పాండాస్ ఎక్కువగా కొంటారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఈ గాడిదలకు బాలీవుడ్ యాక్టర్స్ పేర్లు కూడా పెడుతూంటారు.