NationalNews

 డాక్టర్ అయ్యింది ‘పానీపూరీవాలా’ ఎందుకంటే?

Share with

రాజస్థాన్‌లోని లేడీ డాక్టర్ అనిత వైద్యం మానేసి, పానీపూరీ బండి పెట్టుకుంది. సీకర్ పట్టణంలో ఆమె పనిచేసే ప్రవేట్ ఆస్పత్రికి తాళం వేసి, దాని ఎదురుగానే పానీపూరీని అమ్ముతూ.. ‘అనిత .. పుచ్కావాలీ’ అని బోర్డు కూడా పెట్టారు. తన నేమ్ బోర్డులో కూడా మాజీ డాక్టర్ అని రాసుకున్నారు. ఆమే కాదు చాలా మంది ప్రవేట్ డాక్టర్లు వైద్యం మానేసి, ఆందోళనలు చేస్తున్నారు. దీనికంతటికీ కారణం ఈమధ్యనే రాజస్థాన్‌లోని అశోక్ గహ్యోత్ ప్రభుత్వం తెచ్చిన ఆరోగ్యబిల్లే. దీనికి వ్యతిరేకిస్తున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఈ బిల్లుతో రాష్ట్రంలోని ఎవరైనా సరే అత్యవసర సమయంలో ఏ ఆసుపత్రిలోనైనా ఉచితంగా చికిత్స పొందవచ్చు. దీనిని ‘రైట్ టు హెల్త్’ అనే పేరుతో రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదించింది.

దీనిని ప్రైవేట్ వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో కలిగించుకుంటోందని ఆరోపణలు చేస్తున్నారు. మరొక వైద్యుడు కూడా ఈమె బాటలోనే పరాఠా సెంటర్‌ను ఏర్పాటు చేశారట. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డాక్టర్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.