Home Page SliderInternational

జిలేబీలా ఉన్న “థ్రెడ్స్” యాప్ లోగో అర్థం ఏంటో తెలుసా?

Share with

ట్విటర్‌కు పోటీగా మెటా సంస్థ తీసుకొచ్చిన థ్రెడ్స్ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. కాగా ఇన్‌స్టాతో లింక్ అయి ఉండే ఈ యాప్‌కు యూజర్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో థ్రెడ్స్  యాప్ లోగోపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. కాగా ఇది చూడటానికి అచ్చం జిలేబీలాగానే ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇన్‌స్టా చీఫ్ ఆడమ్ మెస్సేరి దీనిపై స్పందించారు. థ్రెడ్స్ లోగోను “@” గుర్తుకు ప్రేరణతో రూపొందించామన్నారు. కాగా ఇది యాజర్ నేమ్,వ్యక్తి,వాయిస్‌ను రిప్రజెంట్ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇది ఒక అంతం లేని లైన్ అని వెల్లడించారు. థ్రెడ్స్ యాప్ ప్రారంభమైనప్పుడు దీనిని చూడొచ్చని ఆడమ్ మెస్సేరి పేర్కొన్నారు.