InternationalNationalNews Alert

రాఖీని ఏరోజు ఏ టైమ్‌లో కట్టాలో తెలుసా..

Share with

రాఖీ పౌర్ణమి.. సోదర ప్రేమకు ప్రతీకగా ఆడపడుచులు జరుపుకునే ఈ పండుగను శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు.  ఈ సంవత్సరం  రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. దీనికి కారణం శ్రావణ పౌర్ణమి ఆగస్టు 11, 12 రెండు తేదీలలో రావడమే. ఈ సారి శ్రావణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి ఆగస్టు 11 ఉదయం 10.38 నిముషాలకు ప్రారంభమై ఆగస్టు 12 వ తేదీ ఉదయం 7.05 వరకు కొనసాగుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 11 వ తేదీన రక్షాబంధన్ జరుపుకోవడం ఉత్తమం. ఉదయం 10.40 నుండి రాత్రి 9 గంటల వరకూ రాఖీ కట్టడానికి శుభసమయం.

భద్ర ముహుర్తంలో రాఖీని కట్టకూడదు. ఆగస్టు 11 వ తేదీన ఇది సాయత్రం 5.17 నుండి రాత్రి 8.51 వరకూ ఉంటుంది. ఈ భద్ర ముహుర్తాన్ని అశుభంగా భావిస్తారు. ఎందుకంటే లంకాపతి రావణుడి సోదరి భద్ర ముహుర్తంలో రాఖీ కట్టడం వల్లే రాముడి చేతిలో చంపబడ్డాడని ఒక నమ్మకం. మరి సోదరీమణులకు సోదరులు జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇచ్చే ఈ పండుగను అత్యంత శ్రద్ధతో సరైన ముహూర్తంలో జరుపుకుంటారు కదూ..