Home Page SliderNational

ఆలియా భట్ కూతురు ఏమవ్వాలనుకుంటుందో తెలుసా..?

Share with

బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్ ఇటీవల ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తన కూతురుకి ఆలియా రాహా అని నామకరణం చేశారు.   తాజాగా ఆమె రాహా బేబి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కూతురు తనలాగా సినిమా రంగాన్ని ఎంచుకోవాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు. కాగా రాహా తన అడుగు జాడల్లో నడవాలి అని అనుకోవడం లేదన్నారు. అయితే ఆమె గొప్ప గొప్ప పరిశోధనలు చేసి శాస్త్రవేత్త కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆలియా తెలిపారు.ఇది విన్న ఆలియా ఫ్యాన్స్ అయితే రాహా బేబి సినిమాల్లో శాస్త్రవేత్తలా కనిపిస్తారని సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీ “రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ” చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ నెల 28 ప్రేక్షకుల ముందుకు రానుంది.