Home Page SliderTrending Today

‘శాకుంతలం’లో సమంత నగలు విలువెంతో తెలుసా

Share with

త్రీడీ ఎఫెక్టుతో ప్యాన్ ఇండియా మూవీగా రేపు రిలీజ్ కాబోతున్న హిస్టారికల్ మూవీ ‘శాకుంతలం’. ఈ చిత్రంలో శకుంతల పాత్ర ధరించిన క్రేజీ స్టార్ హీరోయిన్ సమంతకు నిజంగా బంగారు నగలు ధరింపజేసారుట. ఆమెకే కాదు దుష్యంతుని పాత్ర ధరించిన దేవ్‌మోహన్‌కు కూడా 15 కిలోల బరువుతో బంగారు నగలు వేశారు. వీటి విలువ తెలిస్తే మతి పోతుంది. వీటి విలువ అక్షరాలా 14 కోట్ల రూపాయలు. ఈ సినిమా గ్రాండ్‌లుక్‌ కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు చిత్రయూనిట్. గుణశేఖర్ దర్శకత్వం లోని ఈ చిత్రంలో యాంటిక్ నగలను, వజ్రవైఢూర్యాలతో కూడిన నగలను తెప్పించి మరీ షూటింగ్‌లో వినియోగించారు. నీతాలుల్లా ఆధ్వర్యంలో కాస్ట్యూమ్స్, జువెలరీ తయారు చేయించారు. వసుంధర కలెక్షన్స్ వారు 8 నెలలు కష్టపడి హ్యాండ్‌మేడ్ జువెలరీ తయారు చేసిచ్చారు. గతంలో ‘రుద్రమదేవి’ సినిమాలో కూడా రాణి రుద్రమగా నటించిన అనుష్క కోసం కోట్లవిలువ చేసే నిజమైన స్వర్ణాభరణాలను తెప్పించారు దర్శకుడు గుణశేఖర్. సినిమాలో ఒరిజినాలిటీ కోసం ‘పసిడి శాకుంతలాన్ని’ మనకు చూపించబోతున్నారు దర్శక నిర్మాతలు.