Home Page SliderInternational

ప్రపంచంలో సోషల్ మీడియాని ఎక్కువగా వాడే దేశం ఏదో తెలుసా..?

Share with

ఈ రోజుల్లో సోషల్ మీడియా వినియోగం బాగా ఎక్కువైపోయింది. కాగా చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరు సోషల్ మీడియాలో ఎప్పుడు బిజీగా గడుపుతున్నారు. అయితే ప్రపంచంలో ఏ దేశాలు సోషల్ మీడియాని ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకోవాలని ఓ కంపెనీ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో రోజులో అత్యధికంగా సోషల్ మీడియా వాడే దేశాల్లో  ఫిలిప్పీన్స్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఆ దేశ ప్రజలు సగటున  రోజుకు 4 గంటల నుంచి 6 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నట్లు సర్వేలో వెల్లడయ్యింది. ఆ తర్వాత కొలంబియా 3గంటల 46 నిమిషాలు,దక్షిణాఫ్రికా 3 గంటల 43 నిమిషాలతో రెండు,మూడు స్థానాల్లో  ఉన్నాయి.  అయితే భారత్ మాత్రం రోజుకు సగటున 2గంటల 36 నిమిషాలు సోషల్ మీడియాను  ఉపయోగిస్తూ..14వ స్థానంలో నిలిచింది.