Home Page SliderTelangana

నిహారిక కొణిదెల విడాకులు

Share with

మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్యలు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి. వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులకు అప్లయ్ చేసారని, విడాకుల ప్రాసెస్ అంతా జరిగిపోయిందని, దాదాపుగా విడాకులు వచ్చినట్లేనని సమాచారం. వారి విబేధాలకు అసలు కారణం తెలియకపోయినా, పరస్పర మనస్ఫర్థలే కారణమని తెలుస్తోంది. 2020లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా ఉదయపూర్‌లోని ప్యాలెస్‌లో జరిగింది. వివాహం జరిగి ముచ్చటగా మూడేళ్లు కూడా గడవక ముందే వీరు విడాకుల నిర్ణయానికి రావడం అభిమానులను కలచివేస్తోంది. ఆరు నెలల క్రితమే తన సోషల్ మీడియా ఖాతాల నుండి నిహారిక ఫొటోలను తొలగించారు చైతన్య. అనంతరం ఆమె కూడా అతడి ఫొటోలను తన ఖాతాల నుండి తొలగించింది. దీనితో విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి. అయితే ఈమధ్య చైతన్య గ్లోబల్ విపాసన పగోడా మెడిటేషన్ సెంటర్‌లో ఫొటోలను షేర్ చేయడంతో వీరి డైవోర్స్ కన్‌ఫర్మ్ అయ్యిందని భావిస్తున్నారు.