Home Page SliderNational

కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ పిటిషన్‌ కొట్టివేత

Share with

ఈ నెల 28న కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించక పోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా కొత్త పార్లమంటు భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా జరగని పక్షంలో తాము ఎవరు కూడా పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోమని ఇప్పటికే 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. దీంతో ఈ కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో విపక్షాలు కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఇలాంటి పిటిషన్లు ఎందుకు దాఖలు చేస్తున్నారో తెలుసన్న సుప్రీంకోర్టు..వీటిని తాము ఎంత మాత్రం ప్రోత్సహించబోమని పేర్కొంది. కాగా దీనికి ఎలాంటి జరిమానా విధించకుండా వదిలేయడం పట్ల కృతజ్ఞతతో ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.