Home Page SliderInternational

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నేరుగా అమెరికా జోక్యం

Share with

రష్యా-ఉక్రెయిన్ల మధ్య రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో అమెరికా నేరుగా వేలు పెట్టబోతోంది. ఉక్రెయన్ యుద్ధరంగంలోకి నేరుగా తమ మిలటరీ కాంట్రాక్టర్లను పంపించే అవకాశాలను బైడెన్ సర్కార్ అలోచిస్తున్నట్లు సమాచారం. ఉక్రెయిన్ పాలసీకి సంబంధించి అమెరికా ప్రభుత్వం నిర్ణయించనుంది. పెంటగాన్‌లోని పలు అమెరికా కంపెనీలు ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా పని చేసేందుకు అనుమతి ఇవ్వనుంది. అమెరికా ఇంతవరకూ నేరుగా ఉక్రెయిన్ యుద్ధంలో తలదుర్చలేదు. ఉక్రెయిన్‌కు కావలసిన ఆయుధాలు, మిస్సైల్స్, యుద్ధ సామాగ్రి మాత్రమే పంపిణీ చేసేది. కానీ ఇప్పుడు అమెరికా నుండి సైనికులను కూడా ఉక్రెయిన్‌కు పంపాలని ఆలోచిస్తోంది. ఇటీవల రష్యా దళాలు క్రమంగా ముందుకు సాగడంతో అమెరికా కూడా ముందంజ వేయాలని చూస్తోంది. ఉక్రెయిన్‌కు అందాల్సిన నిధులకు కొన్నాళ్లు అమెరికా కాంగ్రెస్ అనుమతినివ్వలేదు. కానీ అనంతర కాలంలో అమెరికా ప్రభుత్వ నిధులతో పనిచేసే కాంట్రాక్టర్లను అక్కడకు పంపి ఆయుధాల మరమ్మత్తులు చేయించాలని భావిస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్-16 కీవ్‌కు చేరనుండడంతో వాటి నిర్వహణకు కూడా ఈ సిబ్బంది పనిచేస్తారు. అయితే దీనిపై అమెరికా అధికారులు ఎవ్వరూ స్పందించడం లేదు.