Home Page SliderNational

‘పుష్ప ది రూల్‌’లో శ్రీలీలకు ఆ పాత్ర దక్కిందా?

Share with

‘పుష్ప ది రైజ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. బన్నీ అభిమానులు ‘పుష్ప ది రూల్’ చిత్రం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో బిజీ బ్యూటీ  శ్రీలీల నటిస్తోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి సందడి 2 తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, ఢమాకా చిత్రంతో తఢాకా చూపించిన శ్రీలీలకు వరుసగా సినీ అవకాశాలు వస్తున్నాయి. చేతినిండా 10 సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీలకు మరో సువర్ణావకాశం వచ్చిందట. అల్లు అర్జున్‌తో పుష్ప 2లో అదరగొట్టే డ్యాన్స్ చేయబోతోందని టాక్ నడుస్తోంది. పుష్పలో సమంత చేసిన ‘ఊ అంటావా మావా’ అనే పాట స్థానంలో ఈ చిత్రంలో డాన్సింగ్ స్టార్ అల్లుఅర్జున్‌తో శ్రీలీల దుమ్ము దులిపేస్తుందని అంటున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తకి బన్నీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు డ్యాన్స్ ఫ్లోర్ షేక్ అయిపోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.